telangana
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు
సూర్య కరీంనగర్ : జనసేన పార్టీ వీరమహిళల ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు కరీంనగర్‌లోని జ్యోతిబాపూలే మైదానంలో నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరమహిళలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులను ఎదిరించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యసాహసాలు మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు. మహిళలు అన్యాయాలపై పోరాడుతూ సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. జ్యోతిబాపూలే మైదానంలో జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. కార్యక్రమంలో రాగుల శిరీష, చిట్టి మణితారెడ్డి, కానుగంటి మంగ, గుండేటి లావణ్య, గుండ శకుంతల, తోదేటి భారతి తదితరులు పాల్గొన్నారు.