BREAKING
నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు ప్రచారంలో పాల్గొన్నవిప్ నాయకర్

ఇయాసో –నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ మధ్య అవగాహన ఒప్పందం

Select Suryaa Now
ఇయాసో –నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ మధ్య అవగాహన ఒప్పందం

                                           భవిష్యత్ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులకు ప్రత్యేక శిక్షణ, ఫెలోషిప్ అవకాశాల విస్తరణే లక్ష్యంగా ….

జూబ్లిహిల్స్, మేజర్ న్యూస్;  భారతదేశంలో శస్త్రచికిత్సా క్యాన్సర్ వైద్య విద్యను బలోపేతం చేయడం, భవిష్యత్ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులకు నాణ్యమైన శిక్షణ అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ సంస్థలు అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశాయి. టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ కన్వీనర్ డాక్టర్ సి.ఎస్. ప్రమేష్ ప్రతిపాదించిన ఈ కార్యక్రమం ద్వారా శస్త్రచికిత్సా క్యాన్సర్ వైద్య రంగంలో క్రమబద్ధమైన శిక్షణ, ఫెలోషిప్‌లు, నిపుణుల మార్గదర్శకత్వం, విద్యా సంబంధిత సహకారానికి మరిన్ని అవకాశాలు కల్పించనున్నారు.
హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్, అధ్యక్షుడు డాక్టర్ టి. సుబ్రహ్మణ్యేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు పాల్గొన్నారు. వారిలో టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సి.ఎస్. ప్రమేష్; తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శస్త్రచికిత్సా క్యాన్సర్ విభాగం ప్రొఫెసర్ విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర హులికల్; తిరువనంతపురంలోని 
మూకాంబిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శస్త్రచికిత్సా క్యాన్సర్ విభాగం ప్రొఫెసర్ విభాగాధిపతి డాక్టర్ చంద్ర మోహన్; చెన్నైలోని ప్రభుత్వ కిల్‌పాక్ మెడికల్ కాలేజీ శస్త్రచికిత్సా క్యాన్సర్ విభాగం ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం ఉన్నారు.