ఇంజాపూర్ శ్రీదేవి ధాబాపై అధికారుల ఆకస్మిక తనిఖీలు.
తుర్కయంజాల్, మేజర్ న్యూస్.
జీహెచ్‌ఎంసీ ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధిలోని ఇంజాపూర్‌లో వీఎంఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీదేవి ధాబాపై అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ధాబాలో పారిశుద్ధ్య పరిస్థితులు, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ధాబాలో కుళ్లిపోయిన మాంసం ఉన్నట్లు గుర్తించిన అధికారులు, సంబంధిత నమూనాలను సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు పరీక్షల నిమిత్తం పంపిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏఎంఓహెచ్ షారదా మాట్లాడుతూ.. ధాబాలో అపరిశుభ్రతతో పాటు ఆహార పదార్థాలకు సంబంధించిన పలు అంశాలను పరిశీలించామని, కుళ్లిపోయిన మాంసానికి సంబంధించిన నమూనాలను ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపిస్తున్నామని తెలిపారు.
పరీక్షల నివేదిక ఆధారంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని, హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాల నిర్వాహకులు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్, తుర్కయంజాల్.