telangana
గ్రూప్-2లో విజయం.. ఏసీటీవోగా క్రాంతి కుమార్ - సింగరేణి ఉద్యోగి కుమారుడికి జీఎం సత్కారం
సూర్య నస్పూర్ : సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలో ఎస్ అండ్ పీసీ విభాగంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న భానేష్ కుమారుడు క్రాంతి కుమార్ గ్రూప్-2లో విజయం సాధించి ఏసీటీవోగా ఎంపికయ్యారు. ప్రస్తుతం జగిత్యాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ క్రాంతి కుమార్‌ను మంగళవారం శాలువాతో సత్కరించి అభినందించారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సంస్థకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, జూనియర్ ఇన్‌స్పెక్టర్ రాజయ్య, జమేదార్ రాంచందర్, సీనియర్ సెక్యూరిటీ గార్డు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.