telangana
గ్రామాలలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
సూర్య, హుజురాబాద్:హుజురాబాద్ మండలం రంగాపూర్, తుమ్మనపల్లి గ్రామాలలో శుక్రవారం డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మనపల్లి గ్రామ సర్పంచ్ అన్నాడి మాధవి, ఉప సర్పంచ్ కాశీరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, రంగాపూర్ గ్రామ సర్పంచ్ కుంట అరుణ, ఉప సర్పంచ్ బండి నరేష్, నాయకులు కుంట తిరుపతి రెడ్డి, అన్నాడి రవీందర్ రెడ్డి, మిడిదొడ్డి రాజు, ఆయా గ్రామాల డీలర్లు, ప్రజలు పాల్గొన్నారు.