telangana
'గీత' దాటిన వారిపై వేటు వేయండి ..హై కమాండ్ కు నివేదన
హైదరాబాద్::తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య చోటుచేసుకున్న వివాదంపై టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో వీరిద్దరి మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన ఏఐసీసీ (AICC)కి సమగ్ర నివేదికను పంపారు.
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు, ఉభయ నేతల నుంచి వివరణ తీసుకునేందుకు టీపీసీసీ చీఫ్ వారిద్దరినీ గాంధీ భవన్‌కు పిలిపించారు.
ఈ నివేదికలో కేవలం ఈ వివాదమే కాకుండా, ఇటీవల పార్టీ లైన్ దాటి బహిరంగ వ్యాఖ్యలు చేసిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రవర్తనను కూడా ప్రస్తావించినట్లు సమాచారం.