telangana
ఎస్ఐఆర్ ను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ చిత్రపటం దగ్ధం
సూర్య రాజన్న సిరిసిల్ల సిఐటియు,రైతు,వ్యవసాయ కార్మిక,మహిళ, విద్యార్థి,యువజన,సామాజిక,సాంస్కృతిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి చీఫ్ ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ చిత్రపటాన్ని దగ్ధం చేయడం జరిగింది.అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సర్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చీఫ్ ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ చిత్రపటాన్ని దగ్ధం చేశారు.అనంతరం పలువురు మాట్లాడుతూ దేశ ప్రజల సామాన్య హక్కు ఓటును వినియోగించుకోకుండా బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు.దొంగ ఓట్ల పేరుతో ఉన్న ఓట్లను తీసేస్తూ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని వారి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్,ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆడెపు రజిత, జవ్వాజి విమల, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి నాగరాజు, సిఐటియు జిల్లా నాయకులు సూరం పద్మ, ఎలిగేటి రాజశేఖర్,శ్రీరామ్ సదానందం, మిట్టపెల్లి రాజమల్లు,నక్క దేవదాస్,కోల శ్రీనివాస్,ఈసంపల్లి రాజెల్లయ్య,సిరిమల్ల సత్యం,సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.