BREAKING
దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్! టైగర్ ష్రాఫ్ కారుపై దాడి కేసులో బెదిరింపుల కోణం.. ప్రముఖ నటుడు రాకేష్ బేడీ సంచలన వ్యాఖ్యలు! దశమి పండుగంటే ఆ ఆనందమే వేరు.. దసరా సెలబ్రేషన్స్‌పై మనసు విప్పిన నటి నిమ్రత్ కౌర్! రామాయణం ఈవెంట్‌లో సరదా పొరపాటు.. రణ్‌బీర్ కపూర్‌ను రణ్‌వీర్ సింగ్ అంటూ అభివర్ణించిన దిల్రాజు!

దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి

Select Suryaa Now
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి

 

-  చింతపల్లి  మేజర్ న్యూస్..

దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ చింతపల్లి మాజీ జడ్పిటిసి కంకణాల. ప్రవీణ వెంకట్ రెడ్డి అన్నారు.దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తీదేడు గ్రామంలోని రామాలయం వద్ద భక్తుల పూజలందుకుంటున్న దుర్గామాతను భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...జగజ్జనని దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించమన్నారు.దుష్టశక్తులపై దైవశక్తి విజయానికి,ధర్మానికి ప్రతీకగా నిలిచే శరన్నవరాత్రి పర్వదినాలు భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు.ఆదిపరాశక్తి అయిన దుర్గామాతను ఆరాధించడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, సేవాభావం పెంపొందుతాయని,అమ్మవారి అనుగ్రహంతో సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.లోకకల్యాణం కోసం జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, రైతులు, మహిళలు,యువత, నిరుపేద కుటుంబాలు సుభిక్షంగా జీవించాలని, ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.భక్తిభావంతో శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులను,భక్తులను అభినందించారు.అనంతరం కంకణాల .ప్రవీణ వెంకట్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉలుపాల. స్వప్న శేఖర్ రెడ్డి, తీదేడు గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోనగంటి. గోవర్ధనాచారి,పి.ఏ.సి.యస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య,గ్రామ వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి,మాదగోని కృష్ణ గౌడ్, గంటెల అలివేలు సోమయ్య,దాసరి కళమ్మ ముత్తయ్య, రెడ్డి పద్మ పరమేష్,మర్ల యాదగిరి,శివర్ల పర్వతాలు యాదవ్, గ్రామస్తులు మర్రు రామారావు,ఉలుపాల పురుషోత్తం రెడ్డి,మోర కిరణ్,సిమర్ల శ్రీను యాదవ్,కాయితి బచ్చిరెడ్డి,జెల్లా వెంకటేశ్వర్లు,మర్రు శ్రీనివాస రావు,దాసరి తిరుపతయ్య,కాయితి భగవాన్ రెడ్డి,జూలురి శ్రీధర్,శివర్ల రాములు,శివర్ల ఆంజనేయులు,శివర్ల రమేష్,గంటెల. ఆంజనేయులు,ఉడుత. శంకర్, మునగాల అశోక్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.