దుబ్బాక నియోజక వర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి...
దుబ్బాక ..దుబ్బాక మండల పట్టణ కమిటీల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సి పి ఏం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గొడ్డుబర్ల భాస్కర్ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దుబ్బాక నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉంటుందనీ భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతుల పంటలు దిగుబడి రాక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో వర్షపాతం చాలా తక్కువగా కురిసినందున తెలంగాణ రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అదే తరహాలో కరువు నెలకొన్నదనీ తెలిపారు.ప్రస్తుతం రైతుల బోరుబావులు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయనీ ప్రజలకు తాగునీరు కూడా అందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించి దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని ప్రజలను,రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలనీ నవంబర్ 20 న సి పి ఏం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దుబ్బాక మండలం మున్సిపల్ పట్టణ పరిధిలోని ఐకెపి పిఎసిఎస్ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్. చేశారు.రైతులు ధాన్యాన్ని రైస్ మిల్లులకు అమ్ముకోవడం వల్ల రైస్ మిల్లుల యజమానులు ధాన్యంలో కోతలు విధిస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు.కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించిన దాన్యం బయటనే పూర్తిగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలలోకి తేవాలని అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.అకాల వర్షాలు కురిస్తే చేతికి వచ్చిన పంట పూర్తిగా నష్టపోయి రైతులు దివాలా తీసే ప్రమాదం పొంచి ఉన్నందనీ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలకు రైస్ మిల్లులను మంజూరు చేసి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలనీ డిమాండ్ చేశారు.రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధాన్యం తూకాలలో ఎలాంటి కోతలు విధించకుండా రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి పి ఏం పార్టీ మండల, కార్యదర్శి నవీన, పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, నాయకులు సాదిక్, సాజిద్, మెరుగు రాజు,తదితరులు పాల్గొన్నారు.