సూర్య,రాయికల్ ;;భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఇటీవల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య లూసియానా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పురస్కారం అందుకున్న సందర్భంగా రాయికల్, మేడిపల్లి,భీమారం మండలాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.చిన్నయ్య చేసిన సేవలకు గాను యూనివర్సిటీ గుర్తించి డాక్టరేట్ తో సన్మానించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు గాజంగి రాజేశం,ముక్కెర శేఖర్, దాసరి కృష్ణ హరి రిసోర్స్ పర్సన్లు రాజమల్లయ్య, చిప్ప మల్లేశం, చిలువేరి విజయ్ కుమార్,లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు ఆకు రమేష్,మనోహర్,గిరిధర్,తోట శంకరయ్య,నరసింహరెడ్డి,సతీష్,చంద్రప్రకాష్ ఇన్చార్జి హెచ్.ఎం రవీందర్,రమాదేవి,వేణుమాధవ్, శంకర్ సురేష్,అయిత పద్మ,ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.