BREAKING
చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కార్యక్రమం... ప్రారంభించిన పిసిసి చీఫ్ జాతీయ బాండీ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా రన్నరప్‌గా నిలిచిన తెలంగాణ.. మూడు స్వర్ణాలు, ఒక రజత పతకం కైవసం యూసఫ్‌గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు హంస ఆకారంలో 18 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు శరన్నవరాత్రుల్లో భాగంగా ముగ్గుల పోటీల నిర్వహణ ఎండ వెలుతురు.. పౌష్టికాహారం.. ఆటపాటలతో పిల్లల ఎముకలకు బలం! మైనంపల్లి గెస్ట్ హౌస్‌లో వైభవంగా మైసమ్మ తల్లి తెప్పోత్సవం: హాజరైన మల్కాజిగిరి కాంగ్రెస్ ముఖ్య నేతలు! విజయదశమి స్ఫూర్తితో ఎల్లంపేట అభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ లావుడియా శ్రీదేవి రమేష్ ప్రజలకు పీఏసీ చైర్మన్ ,ఎమ్మెల్యే గాంధీ దసరా శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలిపిన రాగం నాగేందర్ యాదవ్ దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ దంపతులు మియాపూర్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్! శేరిలింగంపల్లి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రవికుమార్ యాదవ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గౌడ్,పూజిత గౌడ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 చాంపియ‌న్‌ మైటీ మరాఠాస్ ఫైనల్లో 6-2తో కాకతీయ నైట్స్‌పై గెలుపు ఉత్త‌మ రిక్వ‌ర్ ఆర్చ‌ర్ గా బొమ్మదేవర ధీరజ్ ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో సందడి చేసిన ఓబిసి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వాణి రెడ్డి

చందానగర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు... పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

Select Suryaa Now
చందానగర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు... పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ  అన్నారు. బతుకమ్మ వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి చందానగర్  డివిజన్ పరిధిలోని  గంగారం చెరువు వద్ద, తారా నగర్ ,శంకర్ నగర్ కాలనీ లలో ఎమ్మెల్యే గాంధీ తాజా మాజీ కార్పొరేటర్   మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి   ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి బతుకమ్మ  వేడుకలను ఎమ్మెల్యే గాంధీ   ప్రారంభించారు.ఈ మేరకు  సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

 ఈ వేడుకలకు వేలాది మంది మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో వచ్చి  బతుకమ్మ పాటలు, ఆడపడుచుల ఆటలతో  పరిసరాలు ఎంతో కోలాహలంగా మారాయి.ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగ అన్నారు . మహిళలు, యువతులు, చిన్నారులు పట్టు వస్త్రాలు, నూతన వస్త్రాలతో సాంప్రదాయబద్దంగా తయారై తెలంగాణ ఆటపాటలతో బతుకమ్మ ఆడారు.

 తీరొక్క పూలు, బంతి పూలతో సద్దుల బతుకమ్మను తయారు చేసి ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. తరతరాలుగా ఆడపడుచులు బతుకమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆనందంగా ఆడుకునే పండుగ. తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ అని అన్నారు.ఈ కార్యక్రమంలో  నాయకులు,కార్యకర్తలు మహిళ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.