చికిత్స పొందుతూ భట్టు మోహన్ మృతి-మోహన్ మృతితో ఆ పల్లె కన్నీరు పెట్టింది
గార్ల, మేజర్ న్యూస్, మండల పరిధి బాలాజీ తండకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గార్ల మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు భట్టు నాగరాజు తండ్రి భట్టు మోహన్ (65)హైదరాబాద్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మృతునికి భార్య మంగమ్మ, ఒక కూతురు, నలుగురు కొడుకులు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కుని కోల్పోయమని, మృతుని భార్య, పిల్లలు, బందవుల రోధనలు మిన్నంటాయి. సమాచారం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ వైస్ ఎంపిపి కట్టెబోయిన శ్రీనివాస్, ఆ పార్టీ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, నాయకులు హరి, గిరి లతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు, మండల జర్నలిస్ట్ లు సిరిపంగి నాగేశ్వరరావు, గుడి శ్రీనివాసరావు, వజ్రం నాగేశ్వరరావు, మాలోత్ సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు భూక్యా బాబులల్ నాయక్, ధరావత్ రాంబాబు నాయక్ లు సోమవారం సందర్శించి, పూల దండలు వేసి, ప్రగాఢ సానుభూతి తెలిపి, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రిపోర్టర్; నాగేశ్వరరావు, గార్ల, మహబూబాబాద్ జిల్లా