చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. యువతకు ఎస్‌ఐ గోపాల్ రెడ్డి సూచన దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి.. పాత కక్షలతో గొడవలకు దిగొద్దు
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. యువతకు ఎస్‌ఐ గోపాల్ రెడ్డి సూచన
దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి.. పాత కక్షలతో గొడవలకు దిగొద్దు
నేరేడుచర్ల, మేజర్ న్యూస్
యువత మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి లక్ష్యాలను నిర్దేశించుకుని ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని నేరేడుచర్ల ఎస్‌ఐ గోపాల్ రెడ్డి సూచించారు.చెడు మీద మంచి విజయం సాధించిన విజయదశమి పండుగ సందర్భంగా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. యువత తల్లిదండ్రుల మాట వింటూ క్రమశిక్షణతో మెలగాలని, పండుగ వేళ రోడ్లపై హంగామా చేయకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. గ్రామాల్లో పాత గొడవలు, వ్యక్తిగత కక్షలను మనసులో పెట్టుకుని ఘర్షణలకు దిగకూడదని సూచించారు. ప్రజలు, ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ దసరా పండుగను ఆనందంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్‌ఐ గోపాల్ రెడ్డి కోరారు.