BREAKING
ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ విద్యుదీకరణ లక్ష్యంపై దేశాలు, సంస్థల సమైక్య ముందడుగు 2025–26లో 253.81 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి మంగళగిరిలో మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు బిజీబిజీ : ఎన్నికల సరళిని పరిశీలించిన తెలుగు యువత రథసారధి ఐఐటీఎఫ్ 2026లో ఆయుష్ పెవిలియన్ సందడి సాగర్ నుంచి ప్రపంచ వేదికపైకి.. హైదారాబాద్ యాచ్ క్లబ్‌కు ప్రతిష్ఠాత్మక వరల్డ్ సెయిలింగ్ ఇంపాక్ట్ అవార్డు! మాజీ లోక్‌సభ స్పీకర్ రబీ రే జయంతి 2029 తర్వాత డ్రగ్స్ సరఫరా చేస్తే అమీర్‌పేట్ చౌరస్తాలో పాతరేస్తాం.. రాజ్యాంగ దినోత్సవం వేళ 22 భాషల్లో నవీకరించిన భారత రాజ్యాంగం ఆవిష్కరణ అమెరికా విమాన సుంకాలతో విమానయాన సంస్థలకే నష్టం పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పడావు పెట్టారు.. ఈసీబీ తదుపరి సారథిగా పాబ్లో హెర్నాండెజ్ డి కోస్ పోలాండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌పై విచారణ ఇద్దరు పిల్లలతో మహిళ అదృశ్యం

బుద్ధారంలో పోలీసుల ముమ్మర దాడులు-300 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం దగ్ధం-32 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు

Select Suryaa Now
బుద్ధారంలో పోలీసుల ముమ్మర దాడులు-300 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం దగ్ధం-32 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు

గార్ల, మేజర్ న్యూస్, మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, బుద్దారం గ్రామ పంచాయతీలో గార్ల, బయ్యారం సీఐ రవీందర్, ఎస్సైలు సాయి కుమార్, ప్రశాంత్ లు తమ పోలీస్ లతో బుధవారం ఉదయం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. 300 లీటర్ల బెల్లం పానకం, 20 లీటర్ల గుడుంబా లను స్వాధీనం చేసుకోని ధ్వంస్యం చేశారు. సరైన కాగితాలు లేని 32 వాహనాలను గుర్తించి, పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్బంగా గార్ల-బయ్యారం సీఐ రవీందర్ మాట్లాడుతూ.. నాటు సారా తయారు చేయడం, ప్రజలకు  విక్రయించడం చట్ట విరుద్ధమన్నారు. గుడుంబా తయారు చేసి, క్రయ విక్రయాలు చేస్తున్న వారి పై పోలీసులు పూర్తి స్థాయిలో "ఆరా.." తీస్తుందన్నారు. ఇక ముందు కఠినమైన చర్యలు తప్పవని సీఐ రవీందర్ హెచ్చరించారు. గంజాయితో పాటు ఇతర ప్రాణాంతకమైన వాటిని సరఫరా చేసినా.. ఎవ్వరికైనా విక్రయించిన కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి పేర్లు తమ పోలీసులకు తెలుపలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గొప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో గార్ల-బయ్యారం ఎస్సైలు, పోలీసులు, హోం గార్డ్స్ పాల్గొన్నారు.

రిపోర్టర్; నాగేశ్వరరావు, గార్ల, మహబూబాబాద్ జిల్లా