బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండ, మేజర్ న్యూస్
హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ అనే బాలుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా, అతని చికిత్స కోసం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక శ్రద్ధ వహించి రూ.5 లక్షల రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించారు. మంజూరైన ఎల్ ఓ సి నీ మంగళవారం కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపత్కాలంలో తమకు ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కు బాధిత కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
రిపోర్టర్; అంజన్ రావు, హనుమకొండ హనుమకొండ జిల్లా