ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ...
టేకులపల్లి మోడల్ స్కూల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
===============
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్.....
పెనుబల్లి మండల పరిధిలోని టేకులపల్లి మోడల్ స్కూల్ లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన లైబ్రేరియన్, కంప్యూటర్ టీచర్, ఆర్ట్ టీచర్,యోగా టీచర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్టు ఆదర్శపాఠశాల ప్రిన్సిపల్ టి బి రూపస్ ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాలతో ఉద్యోగాల అప్లికేషన్లు మోడల్ స్కూల్ నందు సమర్పించవలెను. డిగ్రీ స్థాయిలో లైబ్రరీ సైన్స్ చదివిన అభ్యర్థులు లైబ్రేరియన్ పోస్టుకు, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తోపాటు యోగా స్పెషలైజేషన్ యోగా సర్టిఫికెట్ కలిగిన వాళ్లు యోగా టీచర్ కు, డిగ్రీ స్థాయిలో కంప్యూటర్ అప్లికేషన్ చదివిన వాళ్ళు కంప్యూటర్ టీచర్ కు,డిగ్రీ స్థాయిలో ఫైన్ ఆర్ట్స్ చదివిన వాళ్లు ఆర్ట్ టీచర్కు అర్హత నిబంధనలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ నిబంధనలకు తగినట్లు నోటిఫికేషన్ చూసుకొని దరఖాస్తులు మోడల్ స్కూల్ టేకులపల్లిలో సమర్పించాలని ప్రిన్సిపల్ తెలియజేశారు. మరిన్ని వివరాలకు జిల్లా విద్యాశాఖ ఇచ్చిన నోటిఫికేషన్ పరిశీలించాలని కోరారు. ఈనెల 9,10,11 తేదీలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి స్క్రూటీనీ అనంతరం ఎంపిక చేసిన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందని తెలియజేశారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటన జారీ అవుతుందని కావున అభ్యర్థులు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థుల కొరకు నోటిఫికేషన్లు దానిలోని వివరాలను మోడల్ స్కూల్ నోటీసు బోర్డులో ఉంటుందని తెలిపారు.