ఆ ఊరికి ఏటా రూ. 20 లక్షలు అదా....
ఉచిత వాటర్ ప్లాంట్ ప్రధమ వార్షికోత్సవం.
=================
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
(కిరణ్ కుమార్ ఆరిక )
ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రధమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలోని ఈమని వెంకట్రావు కుమారుడు ఈమని దుర్గాప్రసాద్ ఉచిత తాగు నీటిని ఏర్పాటుచేసి గంగదేవిపాడు గ్రామ ప్రజలకు దాహార్తిని తీరుస్తున్నారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని గంగాదేవి పాడు గ్రామంలో నిర్వహించారు. దుర్గాప్రసాద్ గుంటూరులోని శ్రీ చైతన్య విద్యాసంస్థలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో దుర్గాప్రసాద్ తన ఊరి ప్రజలకు తమ సేవలను అందించాలన్న సంకల్పంతో తన తాత వెంకట రామయ్య - బాపమ్మ , వారి అమ్మ సాంభవతి జ్ఞాపకార్థం గంగదేవి పాడు గ్రామంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు దాహార్తిని తీర్చడంతోపాటు గంగదేవిపాడు గ్రామంలో ఒక ఇంటికి నెలకు సుమారు రూ.350 సంవత్సరానికి సుమారు రూ. 4వేలు ఆదా అవుతుంది. ఈ ఉచిత మంచినీటి వాటర్ ప్లాంట్ వలన గంగదేవిపాడు గ్రామ ప్రజలు సంవత్సరానికి సుమారు 20 లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామా పెద్దలు కనగాల సాంబశివరావు, కనగాల సురేష్ బాబు, ఈమని సతీష్ కుమార్ లకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.