కాంగ్రెస్ పథకాలతో ప్రతి ఇంటా దీపావళి కాంతులే...
రాష్ట్ర నేత డాక్టర్ మట్ట దయానంద్
----------------------------
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...
(కిరణ్ కుమార్ ఆరిక )
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్లో సంక్షేమ అభివృద్ధి ఫలాలతో ప్రతి ఇంటిలో వెలుగులు ప్రకాశిస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ నేత డాక్టర్ మట్ట దయానంద్ అన్నారు.
పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో నిర్వహించిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొని వారి ఆనందంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, కోడూరు మాధవరెడ్డి, నారుమల్ల వెంకటేశ్వరావు, మిట్టపల్లి కిరణ్ కుమార్, వంగ చంద్రశేఖర్, ఇతర మండల నాయకులు కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.