అటవీ శాఖలో 43 మంది ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం స్వీకరణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి: జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి
సూర్య మంచిర్యాల:మంచిర్యాల పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖలో పనిచేస్తున్న 43 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సంఘ సభ్యత్వం స్వీకరించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తుందని తెలిపారు.జిల్లాలో మిగిలిన యూనిట్లలోనూ సభ్యత్వ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి,రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.అన్ని రంగాల్లో మంచిర్యాల జిల్లా ఆదర్శంగా నిలిచేలా ఉద్యోగులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్,కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య,అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు,మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్,కార్యదర్శి అజయ్,ఉపాధ్యక్షుడు ప్రకాష్‌తో పాటు అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.