BREAKING
కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం శిశు మంగళ్ అనాథ ఆశ్రమంలో ఘనంగా దీపావళి వేడుకలు: పిల్లలకు కానుకలు అందజేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కోడిపందాల స్థావరంపై బెజ్జూరు పోలీసుల దాడి ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి శ్రీరామ్ చినబాబును సన్మానించిన జబ్బల మీనా : పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న నేతలు ధనతేరస్, లక్ష్మీ పూజ వేళ రూ.62,000 కోట్లు దాటనున్న బంగారం విక్రయాలు యాలాలలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పాకిస్తాన్‌లో విచ్చలవిడిగా అక్రమ కిడ్నీల వ్యాపారం: అంతర్జాతీయ నివేదిక ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం సొంతింటిలో దీపావళి జరుపుకోవడం ఆనందదాయకం: కలెక్టర్ భవేష్ మిశ్రా పరిటాల ఘాటుకు నివాళులర్పించిన తూంచర్ల నూతన ఎంపీటీసీ పోతులయ్య!!

అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా దీపావళి, మిస్ మ్యాచింగ్ వేడుకలు

Select Suryaa Now
అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా దీపావళి, మిస్ మ్యాచింగ్ వేడుకలు

01 సూర్య కరీంనగర్ : హిందూ సంప్రదాయాల్లో దీపావళి పండుగకు విశేష ప్రాధాన్యత ఉందని, ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని నింపాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు. స్థానిక కొత్తపల్లిలో నిర్వహించిన దీపావళి, మిస్ మ్యాచింగ్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత దీపాలు వెలిగించి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ పండుగ ఐక్యత, ప్రేమ, సోదరభావం, ధర్మం, మానవతా విలువలను చాటిచెబుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు పర్యావరణహిత దీపావళిని జరుపుకోవాలని, బాణాసంచా వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని, విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా నిర్వహించిన మిస్ మ్యాచింగ్ కార్యక్రమంలో విభిన్న వస్తువులు, అంశాల మధ్య తేడాలు, ప్రత్యేకతలను విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ప్రేక్షకుల్లో ఆసక్తిని, ఆనందాన్ని నింపింది.ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.