BREAKING
సీజనల్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు తప్పవు* *విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సురక్షిత వసతి, మెరుగైన విద్యా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి* *సీజనల్ హాస్టళ్ల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* రామ్ చరణ్, సుకుమార్ ఆర్సీ17 సినిమాలో నటించే ఛాన్స్.. ఆడిషన్స్ వివరాలు ఇవే! ఆర్పీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి బ్యాంకులపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో ఆర్బీఐ కీలక పాత్ర విరాట్ కర్ణ కొత్త సినిమా రుస్తుం టైటిల్ గ్లింప్స్ విడుదల.. పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ప్రత్యేక పూజలు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పోలీసు కమిషనర్ భద్రతా తనిఖీలు హైదరాబాద్‌లో ఆసియా జ్యువెల్స్ షో ప్రారంభం పెద్దవరం గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం విజయ్ దేవరకొండ బంగారం లాంటి మనిషి: రష్మికను ప్రభాస్‌తో పోల్చిన రణబాలి సహనటుడు సేవారత్న పురస్కారం అందుకున్న మడిగాల విజయభాస్కర్ రెడ్డి అనుమతి లేని ఏఐ వాడకంపై కఠినంగా ఉండాలి: పర్సనాలిటీ రైట్స్ రక్షణపై అనన్య పాండే కీలక వ్యాఖ్యలు మెల్కోటే పార్క్ లో కార్తీక మాస వనభోజనాలు ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Select Suryaa Now
ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి
హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ కన్వీనర్ బి. వెంకటేశం డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కమిషనర్ కార్యాలయాన్ని వేలాది మంది ఆటో డ్రైవర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఈ సందర్భంగా బి. వెంకటేశం మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. అరకొరగా ఆటో చార్జీలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. తమిళనాడు తరహాలో కనీస ఆటో చార్జీని రూ.50గా, ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.25గా నిర్ణయించాలని కోరారు.
రవాణా రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ప్రత్యేకంగా రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇతర జిల్లాల ఆటోలకు, ద్విచక్ర వాహనాలపై నడిచే బైక్ టాక్సీలకు అనుమతులు నిలిపివేయాలని, ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బందిగా మారుతున్న గ్రీన్ ఎస్‌ఎం టాక్సీల అనుమతులను రద్దు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్లకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బి. వెంకటేశం హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎంఏ సలీం (టీఆర్‌టీయూ), వి. మారయ్య (బీఆర్‌టీయూ), ఏ. సత్తిరెడ్డి (తాడు), వి. ప్రవీణ్ (టీటీయూసీ), కోటయ్య (సీఐటీయూ), పి. యాదగిరి (టీఎన్‌టీయూసీ), ఎండీ మజీద్ (ఆజాద్ ఆటో యూనియన్)తో పాటు వివిధ ఆటో సంఘాల నాయకులు ఎండీ అమానుల్లాఖాన్, ఎం. కృష్ణ, ఎం. నర్సింహా, ఏ. బిక్షపతి యాదవ్, ఎం. శ్రీనివాస్, ఎండీ ఒమర్ ఖాన్, లింగంగౌడ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు