విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ప్రత్యేక పూజలు.
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం విజయవాడలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేలకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యేలకు అందించారు.అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యేలు ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కృప, ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఏ. గోపినాథ్ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ వెంట పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్