BREAKING
నిత్యావసర సరుకులను ప్రభుత్వ నిర్దేశిత ధరలకే వ్యాపారులు విక్రయించాలి* *కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు - 2026’ ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక్క అవకాశం ఇవ్వండి.. హుస్సేనాపురం రూపురేఖలు మారుస్తా! మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి ఓటర్ల జాబితాకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రక్రియలను పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కొండాపూర్ లో పాన్ ఇండియా జెవెల్స్ షో ప్రారంభం డిసెంబర్ 20న చిత్రపురి కాలనీలో శ్రీ అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం VB G RAM G పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా సాధించాలి* *డిసెంబర్ 15వ తేదీలోగా 1,730 పశువుల షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి* పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్ వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు గండికోట వారసత్వ సంపదకు ప్రాచుర్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన లక్ష్యంగా ‘గండికోట రన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

Select Suryaa Now
బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

సూర్య - మానకొండూర్ : అంతర్జాతీయ బాల్య, బలవంతపు బాల్య వివాహ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ ఏడాది నినాదమైన "బాల్య వివాహాలు లేని భారతదేశం కోసం ఒక జ్యోతిని వెలిగించు" అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌డీ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మీరుపురి వెంకటేష్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 4, 2026న ప్రకటించిన మేరకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో 782 జిల్లాల్లో బాల్య వివాహ నిర్మూలన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 18 ఏళ్లలోపు అమ్మాయికి, 21 ఏళ్లలోపు అబ్బాయికి వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం లక్ష రూపాయల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు.అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పారా లీగల్ వాలంటీర్ మాట్లాడుతూ.. 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఎలాంటి న్యాయపరమైన సలహాలు, సహాయం అవసరమైనా జిల్లా కోర్టు ఆవరణంలోని తమ కార్యాలయంలో ఉచితంగా పొందవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు పద్మ, సుజాత, శ్రీనివాస్, ఎస్‌ఆర్‌డీ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ సోషల్ వర్కర్ పి. కోమల తదితరులు పాల్గొన్నారు.