BREAKING
నిత్యావసర సరుకులను ప్రభుత్వ నిర్దేశిత ధరలకే వ్యాపారులు విక్రయించాలి* *కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు - 2026’ ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక్క అవకాశం ఇవ్వండి.. హుస్సేనాపురం రూపురేఖలు మారుస్తా! మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి ఓటర్ల జాబితాకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రక్రియలను పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కొండాపూర్ లో పాన్ ఇండియా జెవెల్స్ షో ప్రారంభం డిసెంబర్ 20న చిత్రపురి కాలనీలో శ్రీ అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం VB G RAM G పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా సాధించాలి* *డిసెంబర్ 15వ తేదీలోగా 1,730 పశువుల షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి* పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్ వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు గండికోట వారసత్వ సంపదకు ప్రాచుర్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన లక్ష్యంగా ‘గండికోట రన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్

Select Suryaa Now
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో మీర్‌ఖాన్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న వివిధ స్టాళ్లు, పెవిలియన్లు, సభా వేదికలు, ప్రదర్శన ప్రాంతాలను టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ ప్రత్యేక అధికారులు, రెడ్కో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సమ్మిట్‌లో నిర్వహించనున్న కార్యక్రమాలు, స్టాళ్లు, సెమినార్, కాన్ఫరెన్స్ హాళ్లు, ముఖ్యమంత్రి, మంత్రుల లాంజ్‌లు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ తదితర ప్రాంతాలను పరిశీలించి, ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి స్టాల్, సభా వేదిక, ప్రదర్శన ప్రాంతానికి అవసరమైన విద్యుత్ లోడ్‌ను ముందుగానే అంచనా వేసి 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని, ప్రత్యామ్నాయ బ్యాకప్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.

విద్యుత్ వైరింగ్, కేబుల్స్, ప్యానెల్స్, ఎర్తింగ్, భద్రతా వ్యవస్థలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రత్యేక విద్యుత్ పర్యవేక్షణ బృందాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రధాన, అంతర్గత రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

సమ్మిట్ విజయవంతానికి విద్యుత్ శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాలు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని, తెలంగాణలోని పటిష్టమైన విద్యుత్ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యుత్ సరఫరా సామర్థ్యం అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ప్రతిబింబించేలా ఏర్పాట్లు ఉండాలని సీఎండీ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, హరిణి, శృతి హర్షిత, టీజీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు శ్రీ సీహెచ్. చక్రపాణి, డాక్టర్ ఎన్. నరసింహులు, శ్రీ వి. శివాజీ, శ్రీ కృష్ణారెడ్డి, సంబంధిత చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు, రెడ్కో అధికారులు పాల్గొన్నారు