BREAKING
నిత్యావసర సరుకులను ప్రభుత్వ నిర్దేశిత ధరలకే వ్యాపారులు విక్రయించాలి* *కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు - 2026’ ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక్క అవకాశం ఇవ్వండి.. హుస్సేనాపురం రూపురేఖలు మారుస్తా! మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి ఓటర్ల జాబితాకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రక్రియలను పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కొండాపూర్ లో పాన్ ఇండియా జెవెల్స్ షో ప్రారంభం డిసెంబర్ 20న చిత్రపురి కాలనీలో శ్రీ అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం VB G RAM G పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా సాధించాలి* *డిసెంబర్ 15వ తేదీలోగా 1,730 పశువుల షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి* పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్ వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు గండికోట వారసత్వ సంపదకు ప్రాచుర్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన లక్ష్యంగా ‘గండికోట రన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

బానిస బతుకులకు స్వస్తి పలికి.. ఆర్థికంగా ఎదగాలి మంత్రి వాకిటి శ్రీహరి

Select Suryaa Now
బానిస బతుకులకు స్వస్తి పలికి.. ఆర్థికంగా ఎదగాలి  మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో ఆనందరావు విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ మల్లు రవి లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ...
ఆనందరావు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.మనమంతా తెలివిమంతులుగా, ఆత్మగౌరవంతో జీవించాలని,బానిస బతుకులకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.  మరొకరికి ఊడిగం చేసే పరిస్థితుల నుంచి బయటపడాలన్నారు.మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడంతో పాటు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని మంత్రి తెలిపారు.విద్య, విజ్ఞానం, కష్టపడే తత్వం మన అభివృద్ధికి పునాదులు కావాలన్నారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని,మన హక్కుల గురించి తెలుసుకోవాలని,మన కాళ్లపై మనం నిలబడే స్థాయికి ఎదగాలని హితబోధ చేశారు.ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే నిజమైన ఆత్మగౌరవం లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, వారు చూపిన మార్గంలో నడవడం మనందరి బాధ్యతన్నారు.వారి ఆశయాలను భావితరాలకు అందించాలని,యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రాణించాలని యువతకు పిలుపునిచ్చారు. సమాజంలో అసమానతలు తొలగి ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించాలని,పేదరికం నుంచి బయటపడేందుకు ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని సూచించారు.  ఆనందరావు ఆశయాలను కొనసాగిస్తూ ఆత్మగౌరవంతో కూడిన సమాజ నిర్మాణానికి మనమంతా కంకణబద్ధులం కావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.