BREAKING
పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్ వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు గండికోట వారసత్వ సంపదకు ప్రాచుర్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన లక్ష్యంగా ‘గండికోట రన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అంతర్జాతీయ వేదికపై చిత్తూరు నగరపాలక సంస్థకు ప్రాతినిధ్యం ముంబైలో జరిగిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌కు నగరపాలక ఆరోగ్యాధికారి డా. అనిల్ కుమార్ హాజరు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కిషన్ రెడ్డిది ఎన్నికల యాత్ర.. షో పుటప్ డ్రామా! ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల టీటీడీ ప్రత్యేక అధికారిగా ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ శ్రీ అర్జా శ్రీకాంత్ నియామకం బీఆర్ఎస్ పార్టీలో చేరిన బంజేరుపల్లి కాంగ్రెస్ నాయకులు పాకెట్ నవల పొంగల్ రిలీజ్.. విజయ్ సేతుపతి, త్యాగరాజన్ కుమారరాజా క్రేజీ కాంబినేషన్ బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సూపర్వైజర్ జ్యోతి బానిస బతుకులకు స్వస్తి పలికి.. ఆర్థికంగా ఎదగాలి మంత్రి వాకిటి శ్రీహరి కాస్మిక్ సామ్సన్ మూవీ రివ్యూ అప్‌డేట్.. సందీప్ ప్రదీప్ నటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఆలేరు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌లో ఆసియా జ్యువెల్స్ షో ప్రారంభం

Select Suryaa Now
హైదరాబాద్‌లో ఆసియా జ్యువెల్స్ షో  ప్రారంభం

తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం ఆభరణాల ప్రదర్శనలలో ఒకటైన ఆసియా జ్యువెల్స్ షో 2026 హైదరాబాద్‌ బంజారాహిల్స్ లోని హోటల్ తాజ్ కృష్ణలో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీనటీమణులు తేజస్వి మడివాడ, పాయల్ రాజ్‌పుత్, దక్ష నగార్కర్, రీతూ చౌదరి, ప్రాంతికా దాస్, ఊర్మిళ చౌహాన్ (మిస్ ఇండియా తెలంగాణ 2023)తో పాటు పలువురు సెలబ్రిటీలు, ఫ్యాషన్ ప్రియులు, ఆభరణాల ప్రియులు ప్రారంభోత్సవానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నవంబర్ 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే ఈ ఆభరణాల ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రముఖ ఆభరణాల సంస్థలకు చెందిన 50 వేలకు పైగా వినూత్నమైన, ఆకర్షణీయమైన ఆభరణాల డిజైన్లను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆసియా జ్యువెల్స్ షో ప్రధాన నిర్వాహకులు హరీష్ సచ్‌దేవ్ మాట్లాడుతూ, “దేశంలోని అత్యుత్తమ ఆభరణాల ప్రదర్శనలలో ఆసియా జ్యువెల్స్ షో ఒకటి. ప్రముఖ ఆభరణాల బ్రాండ్లు, అద్భుతమైన కళానైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలను ఒకే వేదికపై అందిస్తున్నాం. ఆభరణాల ప్రియులు, పెళ్లికి సిద్ధమవుతున్న వధువులు, వివాహ వేడుకలకు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలకు ఈ ప్రదర్శన ఒక చక్కని అవకాశం. దేశంలోని ప్రముఖ జ్యువెలర్స్ నుంచి నచ్చిన ఆభరణాలను కొనుగోలు చేయడంతో పాటు ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ప్రపంచస్థాయి ఆభరణాలు, ప్రీమియం డిజైన్లను వీక్షించేందుకు ఇది ఒక అద్భుతమైన వేదిక” అని తెలిపారు. బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, జైపూర్, సూరత్, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థలు తమ ప్రత్యేక కలెక్షన్లను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచాయి. అంతర్జాతీయ ఆభరణాల డిజైన్లు, అద్భుతమైన కళానైపుణ్యంతో రూపొందించిన ప్రత్యేక ఆభరణాలు ఈ ప్రదర్శనకు మరింత ఆకర్షణను తీసుకువచ్చాయి. వివాహాలు, శుభకార్యాలు, ప్రత్యేక వేడుకలతో పాటు వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలను ఎంపిక చేసుకునేందుకు, తాజా జ్యువెలరీ ట్రెండ్స్‌ను తెలుసుకునేందుకు ఆసియా జ్యువెల్స్ షో ఒక చక్కని అవకాశాన్ని అందిస్తోంది