BREAKING
పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్ వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు గండికోట వారసత్వ సంపదకు ప్రాచుర్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన లక్ష్యంగా ‘గండికోట రన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అంతర్జాతీయ వేదికపై చిత్తూరు నగరపాలక సంస్థకు ప్రాతినిధ్యం ముంబైలో జరిగిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌కు నగరపాలక ఆరోగ్యాధికారి డా. అనిల్ కుమార్ హాజరు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కిషన్ రెడ్డిది ఎన్నికల యాత్ర.. షో పుటప్ డ్రామా! ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల టీటీడీ ప్రత్యేక అధికారిగా ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ శ్రీ అర్జా శ్రీకాంత్ నియామకం బీఆర్ఎస్ పార్టీలో చేరిన బంజేరుపల్లి కాంగ్రెస్ నాయకులు పాకెట్ నవల పొంగల్ రిలీజ్.. విజయ్ సేతుపతి, త్యాగరాజన్ కుమారరాజా క్రేజీ కాంబినేషన్ బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సూపర్వైజర్ జ్యోతి బానిస బతుకులకు స్వస్తి పలికి.. ఆర్థికంగా ఎదగాలి మంత్రి వాకిటి శ్రీహరి కాస్మిక్ సామ్సన్ మూవీ రివ్యూ అప్‌డేట్.. సందీప్ ప్రదీప్ నటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఆలేరు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

విరాట్ కర్ణ కొత్త సినిమా రుస్తుం టైటిల్ గ్లింప్స్ విడుదల.. పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్

Select Suryaa Now
విరాట్ కర్ణ కొత్త సినిమా రుస్తుం టైటిల్ గ్లింప్స్ విడుదల.. పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో ప్రాజెక్టులను తెరకెక్కిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ తమ తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. యువ కథానాయకుడు విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రుస్తుం అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. విరాట్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటూ సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.  

ఈ సినిమాతో కనిష్క గంధం రచయితగా, దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో విజువల్స్, నేపథ్య సంగీతం, యానిమేషన్ అంశాలు గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. బస్తీ నేపథ్యం, దుర్గామాత ఉగ్రరూపం వంటి అంశాలు కథలోని తీవ్రతను, వైవిధ్యతను స్పష్టం చేస్తున్నాయి.సాధారణ కమర్షియల్ యాక్షన్ చిత్రాలకు భిన్నంగా, లోతైన భావోద్వేగాలతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రుస్తుం రూపొందుతోంది.

ముఖ్యంగా మనిషి తనతో తానే చేసుకునే అంతర్గత పోరాటం, అపరాధ భావం ఒక వ్యక్తిని ఎలా వెంటాడుతుందనే అంశాన్ని దర్శకుడు బలంగా చూపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా సంకేతాలు ఇచ్చారు. తన పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్ ప్రకటించడం ఎంతో ప్రత్యేకంగా ఉందని, పాషనేట్ టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని విరాట్ కర్ణ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు.  

రుస్తుం ప్రపంచం నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ అందిస్తామని చిత్రబృందం వెల్లడించింది. కొత్త దర్శకుడి విజన్, విరాట్ కర్ణ ఎనర్జీ, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువల కలయికలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.