BREAKING
పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్ వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు గండికోట వారసత్వ సంపదకు ప్రాచుర్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన లక్ష్యంగా ‘గండికోట రన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అంతర్జాతీయ వేదికపై చిత్తూరు నగరపాలక సంస్థకు ప్రాతినిధ్యం ముంబైలో జరిగిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌కు నగరపాలక ఆరోగ్యాధికారి డా. అనిల్ కుమార్ హాజరు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కిషన్ రెడ్డిది ఎన్నికల యాత్ర.. షో పుటప్ డ్రామా! ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల టీటీడీ ప్రత్యేక అధికారిగా ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ శ్రీ అర్జా శ్రీకాంత్ నియామకం బీఆర్ఎస్ పార్టీలో చేరిన బంజేరుపల్లి కాంగ్రెస్ నాయకులు పాకెట్ నవల పొంగల్ రిలీజ్.. విజయ్ సేతుపతి, త్యాగరాజన్ కుమారరాజా క్రేజీ కాంబినేషన్ బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సూపర్వైజర్ జ్యోతి బానిస బతుకులకు స్వస్తి పలికి.. ఆర్థికంగా ఎదగాలి మంత్రి వాకిటి శ్రీహరి కాస్మిక్ సామ్సన్ మూవీ రివ్యూ అప్‌డేట్.. సందీప్ ప్రదీప్ నటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఆలేరు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బ్యాంకులపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో ఆర్బీఐ కీలక పాత్ర

Select Suryaa Now
బ్యాంకులపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో ఆర్బీఐ కీలక పాత్ర

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంతో పాటు ఆవిష్కరణలు, పోటీని ప్రోత్సహించడంలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక పాత్ర పోషిస్తోందని ఆ బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ఆతిథ్య ఉపన్యాసంలో ఆయన మాట్లాడారు. ‘రిజర్వు బ్యాంకు – దైనందిన జీవితంలో మార్పు’ అంశంపై బిజినెస్ ఎకనామిక్స్ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ద్రవ్య స్థిరత్వం, ద్రవ్యోల్బణ నియంత్రణ, బ్యాంకుల పర్యవేక్షణ, కరెన్సీ నిర్వహణ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంలో ఆర్బీఐ బాధ్యతలను సుబ్బారావు వివరించారు. ఆర్థిక వృద్ధి, ధరల స్థిరత్వం మధ్య సమతుల్యత, ద్రవ్య విధానం, మారకపు రేట్ల హెచ్చుతగ్గులు, నకిలీ కరెన్సీ, డిజిటల్ రూపాయి వంటి అంశాలపై ఆయన చర్చించారు. 2008–2013 మధ్య ఆర్బీఐ 22వ గవర్నర్‌గా పనిచేసిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ద్రవ్య విధానం, స్థూల ఆర్థిక నిర్వహణకు సంబంధించిన అంశాలను వాస్తవ ఆర్థిక సవాళ్లతో అనుసంధానించారు. ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ఎంబీఏ విద్యార్థులు, బిజినెస్ ఎకనామిక్స్ విభాగాధిపతి డాక్టర్ అజయ్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ సోఫియా, డాక్టర్ భాస్కర్, డాక్టర్ సాయి ఆశిష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉపన్యాసం విద్యార్థులకు కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థపై ఆచరణాత్మక అవగాహన కల్పించింది.