BREAKING
పసికందు వైద్యానికి ఖాకీల ఆపన్నహస్తం గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన విద్యుత్ ఏర్పాట్లు – భద్రతకు ప్రాధాన్యత: సీఎండీ జితేష్ వి. పాటిల్ వేరుశనగ పంటకు జిప్సం తప్పనిసరి ఏడీఏ వెంకటేశ్వర్లు సూచన ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు – పలు సేవా కార్యక్రమాలు గండికోట వారసత్వ సంపదకు ప్రాచుర్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన లక్ష్యంగా ‘గండికోట రన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అంతర్జాతీయ వేదికపై చిత్తూరు నగరపాలక సంస్థకు ప్రాతినిధ్యం ముంబైలో జరిగిన 3వ వరల్డ్ మేయర్స్ ఫోరమ్‌కు నగరపాలక ఆరోగ్యాధికారి డా. అనిల్ కుమార్ హాజరు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కిషన్ రెడ్డిది ఎన్నికల యాత్ర.. షో పుటప్ డ్రామా! ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల టీటీడీ ప్రత్యేక అధికారిగా ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ శ్రీ అర్జా శ్రీకాంత్ నియామకం బీఆర్ఎస్ పార్టీలో చేరిన బంజేరుపల్లి కాంగ్రెస్ నాయకులు పాకెట్ నవల పొంగల్ రిలీజ్.. విజయ్ సేతుపతి, త్యాగరాజన్ కుమారరాజా క్రేజీ కాంబినేషన్ బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: సూపర్వైజర్ జ్యోతి బానిస బతుకులకు స్వస్తి పలికి.. ఆర్థికంగా ఎదగాలి మంత్రి వాకిటి శ్రీహరి కాస్మిక్ సామ్సన్ మూవీ రివ్యూ అప్‌డేట్.. సందీప్ ప్రదీప్ నటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన ఆలేరు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

Select Suryaa Now
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చంపాపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు ఏడాది క్రితం రూ.17 లక్షల వ్యయంతో పాఠశాలలో జీ+2 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినప్పటికీ, ఇప్పటివరకు వాటికి అవసరమైన కుండీలు ఏర్పాటు చేయకపోవడం, నీటి సౌకర్యం కల్పించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి, పనులు పూర్తిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కి ఫోన్ చేసి సమస్యను వివరించి, తక్షణమే పరిష్కరించాలని కోరారు. పాఠశాలలో దాదాపు 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఇంతమంది విద్యార్థులకు కేవలం 8 నుంచి 9 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న 32 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి కూడా సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేదని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ, విద్యాశాఖ అధికారుల బాధ్యత అని, ముఖ్యంగా పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్ల వంటి ప్రాథమిక సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు.