పెద్దవరం గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం
నగరం, మేజర్ న్యూస్: మండల పరిధిలోని పెద్దవరం గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు ఇచ్చిన కీర్తిపాటి తులసి సర్పంచిగా ఎన్నికయ్యారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని, పెద్దవరం గ్రామ పరిరక్షణ కమిటీ తోపాటు, అనేక వర్గాల నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని, గ్రామస్తులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పెద్దవరంలో ఎన్నిక ఏకగ్రీవం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.