BREAKING
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలిక రద్దు ఏఐతో మానవాళి మనుగడకే పెను ముప్పు.. సంచలన హెచ్చరికలు చేసిన బిల్ గేట్స్ మద్యం మత్తులో ఘర్షణ.. సవతి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు కూలి డబ్బుల వివాదంలో తమిళనాడు కూలీ దారుణ హత్య....! ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌లోకి చొరబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. భారత్‌కు హెచ్చరికగా నిలిచిన ఏఐ ఏజెంట్ ఉల్లంఘన తక్కువ ఖర్చుతో మురుగునీటి శుద్ధి విధానాన్ని రూపొందించిన 20 ఏళ్ల యువకుడికి యూఎన్‌డీపీ గుర్తింపు ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి మహిళ సమైక్య సభ్యుల సమావేశం. పొదలకూరు పోలేరమ్మ జాతరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆహ్వానం తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రజలే ప్రథమం.. పరిష్కారమే పరమార్థం యథావిధిగా ప్రజలతో కమీషనర్ ముఖాముఖీ తెలంగాణలో వాతావరణం.. రానున్న రెండు రోజులూ.. గరం.. గరమే..! వికారాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం... కలకలం రేపుతున్న ఘటన, గోశాలపై పంజా పల్లె పండుగకు కోవూరు నుంచి భారీ జనసమీకరణ

వికారాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం... కలకలం రేపుతున్న ఘటన, గోశాలపై పంజా

Select Suryaa Now
వికారాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం... కలకలం రేపుతున్న ఘటన, గోశాలపై పంజా

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 27): వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బసిరెడ్డిపల్లి సమీప ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలో కొనసాగుతున్న గోశాలపై ఈ క్రూరమృగం పంజా విసిరింది. కొద్ది రోజుల క్రితం ఒక లేగదూడను అటవీ ప్రాంతానికి ఎత్తుకెళ్లిన వైనం వెలుగులోకి రాగా తాజాగా మరో గోవుపై దాడి జరగడం భయాందోళనలను రెట్టింపు చేసింది. గోశాలలో ఉన్న ఆవుపై పులి దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న గో సంరక్షకుడు అప్రమత్తమై పెద్దపెట్టున కేకలు వేయడంతో ఆ ప్రాణిని విడిచిపెట్టి సమీప అడవిలోకి పారిపోయినట్లు తెలుస్తోంది.
ఈ హఠాత్పరిణామంలో తీవ్రంగా గాయపడిన ఆవు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. దాడి సమయంలో ఆవు మెడ అలాగే ఉదర భాగంలో తీవ్ర గాయాలు కాగా, దాని వీపుపై పులి పెద్ద పంజా ఆనవాళ్లు స్పష్టంగా కనిపించినట్లు గో సంరక్షకులు ధృవీకరించారు. సుమారు రెండు వందల వరకు మూగజీవాలు ఆశ్రయం పొందుతున్న ఈ గోశాల సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలలో పులి కదలికల దృశ్యాలు రికార్డైనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వందలాది గోవులు ఉన్న ఈ ప్రాంగణంలో పులి సంచరిస్తుండటంతో వాటి రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, నిర్వాహకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి రంగంలోకి దిగాలని స్థానిక ప్రజలు అలాగే గోశాల నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల వైపు వస్తున్న ఈ పెద్దపులిని వీలైనంత త్వరగా గుర్తించి సురక్షితంగా బంధించాలని, తద్వారా గోశాలకూ మరియు పరిసర గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అటవీ ప్రాంతం నుంచి పులి ఎటువైపు నుంచి వచ్చిందనే అంశంపై అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ దారుణ ఘటనల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్థానిక పెద్దలు హెచ్చరిస్తున్నారు.