పల్లె పండుగకు కోవూరు నుంచి భారీ జనసమీకరణ
పల్లె పండుగకు కోవూరు నుంచి భారీ జనసమీకరణ
సన్నాహక సమావేశంలో పాల్గొన్న పత్తిపాటి పుల్లారావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామారావు గ్రామంలో ఈ నెల 29న నిర్వహించనున్న పల్లె పండుగ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు కోవూరు నియోజకవర్గం నుంచి జనసమీకరణపై నెల్లూరులోని వీఆర్‌పీఆర్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశీలకులు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. సభకు కోవూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సన్మానం
ఇదే సందర్భంగా పదవీకాలం పూర్తి చేసుకున్న కోవూరు నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.