BREAKING
బుచ్చిలో పలు వార్డులలో శంకుస్థాపనలు చేసిన ఎంపి, ఎమ్మెల్యే ఉచిత కంటి వైద్య శిబిరం సోమిరెడ్డి అవినీతిని అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు" సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం నంద్యాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఓట్ల చోరీకి నిరసనగా సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన.. కాలువలు, డ్రెయిన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు రూ.160 కోట్ల బిల్లుల విడుదల తగ్గిన పసిడి ధర.... వెండి కూడా అదే బాటలో.. అర్ధరాత్రి భారీ శబ్దాలతో లౌడ్‌స్పీకర్లు: పోలీసులకు నటుడు అల్లు శిరీష్ ఫిర్యాదు.. నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు తెలంగాణలో ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్ మెట్రో విస్తరణను కాంగ్రెస్ అటకెక్కించింది: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ధ్వజం హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు బ్యాంకులు తెరిచే ఉంటాయి

ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కు కొత్త బలం

Select Suryaa Now
ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కు కొత్త బలం

ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌కు కొత్త బలం

280 మంది కానిస్టేబుళ్ల దీక్షాంత పరేడ్‌లో మంత్రి సుభాష్

• తొమ్మిది నెలల కఠిన శిక్షణ పూర్తి
• ప్రజల విశ్వాసమే పోలీసు వ్యవస్థకు బలమని సందేశం
• క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో పనిచేయాలని పిలుపు
• ప్రతిభ చూపిన క్యాడెట్లకు బహుమతులు

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో,
( కాకినాడ)

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) 3వ బెటాలియన్‌లో తొమ్మిది నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న 280 మంది పోలీస్ కానిస్టేబుళ్ల దీక్షాంత పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. 2025–26 బ్యాచ్ రెండో బేసిక్ ట్రైనింగ్‌కు చెందిన కానిస్టేబుళ్ల పరేడ్‌ను మంత్రి పరిశీలించి సెల్యూట్ స్వీకరించారు.

ఉద్యోగం కాదు.. బాధ్యత

పోలీసు ఉద్యోగాన్ని కేవలం ఉపాధిగా చూడరాదని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు సమాజంలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యత పోలీసులపై ఉందని మంత్రి పేర్కొన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు భద్రతతో పాటు భరోసా కల్పించాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న విలువలు, నైపుణ్యాలను క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టాలని సూచించారు.

కానిస్టేబుల్ నుంచి ఉన్నతస్థాయికి

కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి డిప్యూటీ కమాండెంట్ స్థాయికి ఎదిగిన వానసెట్టి సుబ్బారావును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కృషి, పట్టుదల, అంకితభావంతో పోలీసు శాఖలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనేందుకు ఆయన ప్రస్థానం నిదర్శనమన్నారు.

3వ బెటాలియన్ కమాండెంట్ కె.ఎన్. కుమార్ మాట్లాడుతూ శారీరక దృఢత్వంతో పాటు చట్టాలపై అవగాహన, ప్రజలతో మమేకమయ్యే తీరు, బాధ్యతాయుతమైన సేవ పోలీసులకు ముఖ్యమన్నారు. శాఖ ప్రతిష్టను పెంచేలా కొత్త కానిస్టేబుళ్లు పనిచేయాలని సూచించారు.

ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు బహుమతులు అందజేశారు. పోలీసు బ్యాండ్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గరికపాటి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. పోలీసు ఉన్నతాధికారులు, శిక్షకులు, క్యాడెట్ల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.