BREAKING
మేడ్చల్‌లో విద్యుత్ భద్రతా నిబంధనలకు తూట్లు.. ఎల్‌సీ లేకుండానే ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ప్రైవేట్ సిబ్బంది ప్రజా సమస్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి 2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్! నకిలీ ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై చర్యలు తీసుకోవాలి ఢిల్లీ అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటో కేసు ప్రేమించిన వ్యక్తి మరణం తట్టుకోలేక... యువతి ఆత్మహత్య విద్యుత్ స్తంభాలే ప్రమాదం ఘటికలు స్థల వివాదంపై కలెక్టర్‌కు ఫిర్యాదు SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి గోవాలో షూటింగ్ చేస్తుండగా హీరో విశాల్‌కు తీవ్ర గాయం భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకం మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువత ప్రతిజ్ఞ ఎల్లంపేట్ బీజేపీ నేతలకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు పిట్టగూడలో పాడైన బోర్‌వెల్‌.. తాగునీటికి ఇబ్బందులు ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

ఓట్ల చోరీకి నిరసనగా సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన..

Select Suryaa Now
ఓట్ల చోరీకి నిరసనగా సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన..

 

సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం


సూర్య రాజన్న సిరిసిల్ల:ఏఐసీసీ పిలుపు,టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం రోజున సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఓట్ల చోరీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తీసుకున్న వ్యవస్థ వ్యతిరేక నిర్ణయాలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు.నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.ఈ కార్యక్రమంలో జిల్లా,పట్టణ,మండల కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.