నంద్యాలలోని నూనెపల్లె అభివృద్ధిపై రిలే దీక్షలు
నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె ప్రాంత అభివృద్ధిపై సోమవారం రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి.
నూనెపల్లె అభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో వందేమాతరం స్పూర్తితో (మన జన్మభూమి వందనం) పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు.
నూనెపల్లెను కాపాడుకుందాం-గత వైభవాన్ని సాధిద్దాం, మనం పుట్టి పెరిగిన ఈ ప్రాంత రుణం తీర్చుకుందాం నినాదంతో నూనెపల్లె ప్రాంత అభివృద్ధి కోసం రోడ్డెక్కారు. కమిటీ డిమాండ్స్ ఇలా ఉన్నాయి.
1.యుద్ధ ప్రాతిపదికన నూనెపల్లె రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం జరగాలి.
2.సాయిబాబా నగర్ దగ్గర శ్యామ కాలువ పై ఉన్న R&B బ్రిడ్జి విస్తరణ జరగాలి.
3.నూనెపల్లె, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్.జి.ఓ కాలనీకి వెళ్ళే రస్తా కూడలిలో సిగ్నల్ లైట్స్ వేసి ట్రా ఫిక్ నియంత్రణ జరగాలి.
4.నూనెపల్లె సెంటరులో నిత్యం పోలీసుల పర్యవేక్షణ కొరకు పికెట్ ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతినిధులు కోరుతున్నారు.