భగత్ సింగ్ దేశభక్తి కి ప్రతిరూపం
భగత్‌సింగ్ దేశభక్తికి ప్రతిరూపం.…
కపిలేశ్వరపురం మేజర్ న్యూస్. : కపిలేశ్వరపురం మండలం వల్లూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చిట్టూరి వెంకట శ్రీధర్ భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు భగత్‌సింగ్ జీవితం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి గురించి వివరించారు. భగత్‌సింగ్ దేశభక్తికి ప్రతిరూపమని, ధైర్యానికి ప్రతీక అని, ధీరత్వానికి మారుపేరుగా నిలిచిన భయమెరుగని భారతీయుడని పేర్కొన్నారు. దేశం కోసం చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన భగత్‌సింగ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుబ్బారావు, రామతులసి, కామేశ్వరి, గణేష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.