పాము కాటుతో ఆవు మృతి
బావుసింగ్ నాయక్ తండాలో విషాదం
సూర్య వీర్నపల్లి: బావుసింగ్ నాయక్ తండ నాయక్ తండాకు చెందిన రైతు బట్టు సంతోష్‌కు చెందిన ఆవు పాము కాటుకు గురై మృతి చెందింది. పొలంలో మేత మేస్తున్న సమయంలో విషపూరిత పాము కాటువేయడంతో కొద్దిసేపటికే ఆవు మృతి చెందింది. సుమారు రూ.40 వేల విలువైన ఆవు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్, వార్డు సభ్యుడు మోహన్, తండావాసులు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.