శ్రీవారి సుప్రభాత సేవలో నటి మీనాక్షి చౌదరి.
తిరుమల మేజర్ న్యూస్:
తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో నటి మీనాక్షి చౌదరి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.