కాశీ విశ్వనాధుని సేవలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు
శ్రీ కాశీ విశ్వనాథుని సేవలో ఎమ్మెల్యే వేగుళ్ళ…
మండపేట మేజర్ న్యూస్ : వారణాసిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సందర్శించారు. తన పెద్దల్లుడు పి.సురేష్ కుమార్, కుమార్తె మణి మంజరి, మేనల్లుడు ఎం.జె.జె.ఎం.చౌదరి మనుమరాలు సాయిస్వాతిక రెడ్డి లతో కలిసి సోమవారం సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా పరమ పవిత్రమైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారిని, శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే వేగుళ్ళకు వేదాశీర్వచనం గావించి, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.