BREAKING
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి భూ రీ సర్వేను సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ సయ్యద్ చాంద్‌కు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఆత్రం సుగుణక్క విమానంలో తీవ్ర కలకలం.. 15 వేల అడుగులకు పడిపోయిన విమానం పల్లె పండుగ 3.0తో గ్రామాలకు మహర్దశ రూ.44 లక్షలతో నాలుగు గ్రామాల్లో సీసీ రోడ్లకు భూమిపూజ నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా వేల్ సినిమా ట్రైలర్ లాంచ్.. వచ్చే నెలలో గ్రాండ్ రిలీజ్ నూతన సబ్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించిన సిఎండి ఒంగోలు ఉత్సవం...అత్యద్భుతం కొల్లూరులో ఐదు ఎకరాల్లో మోడల్ మార్కెట్ కరీంనగర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన +నూతన కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభం సీఎం దిష్టిబొమ్మ దహనానికి బిజెపి యత్నం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో రవితేజ ఇరుముడి హవా.. మొదటి స్థానంలో నిలిచిన మాస్ రాజా చిత్రం మినుము సాగులో సమగ్ర పంట యాజమాన్యంపై శిక్షణా కార్యక్రమం పౌరులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యం ----సెవోత్తమ్ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్. ఎల్ వినో ప్రభావం--పశుపోషకులు జాగ్రత్త

హామీల అమలుపై స్పష్టతనివ్వాలి..

Select Suryaa Now
హామీల అమలుపై స్పష్టతనివ్వాలి..

మిడ్‌మానేరు నిర్వాసితులకు రూ.5.04 లక్షలు ఇవ్వాలి..- మాజీ ఎమ్మెల్యే సుంకె రవి,సూర్య రాజన్న సిరిసిల్ల,సిరిసిల్లలో సీఎం సభ కోసం మంత్రులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదని,సిరిసిల్లలో జరిగిన అభివృద్ధిని కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని కొడంగల్‌ను అభివృద్ధి చేసుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు.సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలు
మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం సిరిసిల్ల ఎలా ఉండేది,ప్రస్తుతం ఎలా అభివృద్ధి చెందిందో సీఎం రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలని,ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్లను ‘సిరుల సిల్ల’గా మార్చిన ఘనత మాజీ మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందని  రవిశంకర్‌ అన్నారు.రాష్ట్రం,దేశంలోనే సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్‌దేనన్నారు.గత మూడేళ్లలో ఉపాధి లేక 35 మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని,వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులు,చేనేత కార్మికులకు బీమా పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మిడ్‌మానేరు ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు కేసీఆర్‌ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.నిర్వాసితుల 90 శాతం సమస్యలను పరిష్కరించామని తెలిపారు. మిగిలిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయాలని,ఒక్కో కుటుంబానికి రూ.5.04 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు ఉపాధి కల్పించడంతో పాటు అవసరమైన చోట కారిడార్లు ఏర్పాటు చేయాలని కోరారు.మూడేళ్లుగా సిరిసిల్లకు ఒక్క రూపాయి ఇవ్వని రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. సిరిసిల్లలో అభివృద్ధి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. గతంలో సిరిసిల్లకు నిధులు తీసుకురావడంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలని అన్నారు.తోట ఆగయ్య మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌,కేటీఆర్‌, హరీశ్‌రావు,బీఆర్‌ఎస్‌ నేతలను విమర్శించడం తప్ప మరొక పని లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి సిరిసిల్లకు రావాలని డిమాండ్‌ చేశారు.