BREAKING
ముంపుకు గురైన పంట పొలాల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పర్యటన సినీ నటుడు రామ్ చరణ్ సినీ ప్రస్థానం 19 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు సందర్భంగా పాము కాటుతో ఆవు మృతి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం శ్రీవారి సుప్రభాత సేవలో నటి మీనాక్షి చౌదరి. వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘటోత్సవం భగత్ సింగ్ దేశభక్తి కి ప్రతిరూపం రైతుల భాగస్వామ్యంతోనే సాగునీటి నిర్వహణకు పెద్దపీట కాశీ విశ్వనాధుని సేవలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు నంద్యాలలో అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య బుచ్చిలో పలు వార్డులలో శంకుస్థాపనలు చేసిన ఎంపి, ఎమ్మెల్యే ఉచిత కంటి వైద్య శిబిరం సోమిరెడ్డి అవినీతిని అడ్డుకుంటున్న తెలుగు తమ్ముళ్లు" సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం నంద్యాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

బ్యాంకులు తెరిచే ఉంటాయి

Select Suryaa Now
బ్యాంకులు తెరిచే ఉంటాయి

బ్యాంకులు తెరిచే ఉంటాయి - వాయిదా పడిన బ్యాంకుల సమ్మె

బ్యాంకులు యధావిధిగా   సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి

నెల్లూరు, మేజర్ న్యూస్ : దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు బ్యాంక్ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్  జరిపిన చర్చలు కొలిక్కరావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె విరమింప చేసేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించడం అనే అంశంపై చర్చించడానికి ఐబీఏ యూఎఫ్‌బీయూ ప్రతినిధులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది......

అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుంది.ఇక పీఎల్‌ఐ పథకంపై సవరణలకు సంబంధించి స్కేల్ 4 , అంతకంటే పై స్థాయి అధికారులకు సంబంధించిన పీఎల్‌ఐ స్కీమ్‌పై యూనియన్లు లేవనెత్తిన అభ్యర్థనలను పరిశీలించనున్నారు. ప్రభుత్వానికి తగిన సవరణలను ప్రతిపాదించేందుకు ఐబీఏతో చర్చలు జరపడానికి తద్వారా మార్గం సుగమమైంది.....

పెండింగ్ సమస్యల పరిష్కారం పై కూడా చర్చలు జరగనున్నాయి.. 2024 మార్చి 8 నాటి మినిట్స్‌లో పేర్కొన్న మిగిలిన పెండింగ్ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించుకోవడానికి ఐబీఏ, యూఎఫ్‌బీయూ మధ్య తదుపరి చర్చలు జరగనున్నాయి. ఐబీఏతో జరిగిన ఒప్పందాలు , సానుకూల పరిణామాల నేపథ్యంలో గతంలో ప్రకటించిన అన్ని ఆందోళన కార్యక్రమాలను, సమ్మెలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ యధావిధిగా పనిచేయనున్నాయి.....