ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలిక రద్దు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలిక రద్దు
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : ఈ నెల 28వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందున ప్రజల నుంచి వినతులు స్వీకరించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 28న తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.