BREAKING
భారత్‌, నేపాల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు బ్రిటన్‌లో ఎయిర్‌బేస్ సమీపంలో విస్ఫోటకాల చట్టం కింద ఇద్దరి అరెస్ట్ అంతర్జాతీయ స్థాయిలో గణేశుడి వైభవం గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి పరిశుభ్రతే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా ది వాన్ సినిమా.. రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు సోమ్‌నాథ్, మోధేరా దేవాలయాలు భారతీయ సాంస్కృతిక పట్టుదలకు ప్రతీకలు అశోక్ సింఘాల్ శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళి సొంత పార్టీని వీడి బీజేపీలోకి వెళ్తే అవమానాలే మిగులుతాయి జనాభా లెక్కల్లో 32 కోట్లకు పైగా కుటుంబాల నమోదు నా జీవితంలోని కష్టాలే మీసయ మురుక్కు 2 సినిమా.. హిప్హాప్ ఆది ఎమోషనల్ కామెంట్స్ మన్ కీ బాత్ వేదికగా సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కొండా లక్ష్మణ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం పల్లెల్లో అభివృద్ధి వెలుగులు! మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌కు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘన సన్మానం

పర్యాటక దినోత్సవ వేళ.. కన్నీళ్లతో కడలి తీరం... వసతుల్లేక రోదిస్తున్న రేవుపోలవరం బీచ్!

Select Suryaa Now
పర్యాటక దినోత్సవ వేళ.. కన్నీళ్లతో కడలి తీరం... వసతుల్లేక రోదిస్తున్న రేవుపోలవరం బీచ్!

ఎస్.రాయవరం, సెప్టెంబర్ 27, మేజర్ న్యూస్:
రేవుపోలవరం బీచ్ ఒక సుందరమైన, ప్రశాంతమైన తీరప్రాంతం. పర్యాటక రంగానికి ఎంతో అనుకూలమైన ఈ ప్రాంతం అరకొర వసతి సౌకర్యాలతో తీవ్ర ఆవేదనతో రోదిస్తోంది! అయినప్పటికీ, ప్రపంచ పర్యాటక దినోత్సవం ఆదివారం కలిసి రావడంతో అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండల పరిధిలోని ప్రముఖ తీరప్రాంతం, సహజసిద్ధ టూరిస్ట్ స్పాట్ రేవుపోలవరం బీచ్ అరకొర పర్యాటకులతో అంతంతమాత్రంగా కనిపించింది.

ఒక్కసారి అలా రేవుపోలవరం వైపు వెళ్ళొస్తే.
ఉదయం నుంచే సూదూర ప్రాంతాల నుంచి యువత, పర్యాటకులు వచ్చారు. సహజసిద్ధంగా ఏర్పడిన నల్లరాతి శిలలు, కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ మాధవస్వామి ఆలయం, కొండ దిగువన ఏర్పాటు చేసిన శివపార్వతుల విగ్రహాలు, సముద్రంలోకి చొచ్చుకుపోయిన పొడవైన వంతెన పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

బంగారువర్ణంలో మెరుస్తూ.. పర్యాటకుల్ని కనువిందు చేస్తూ
సాయంత్రం వేళ సూర్యాస్తమయ సమయంలో ఆకాశం రంగులమయం కాగా, బంగారు వర్ణంలో మెరిసే సముద్ర తీరం ఫోటోగ్రాఫర్లకు, పర్యాటకులకు కనువిందు చేసింది. చిన్నారులు ఇసుకలో ఆడుకుంటూ, యువత సెల్ఫీలతో సందడి చేయగా, పెద్దలు ప్రశాంతమైన అలల హోరును ఆస్వాదించారు.

సముద్రంలోకి నడిచే వంతెన... రేవుపోలవరం బీచ్ ప్రత్యేక ఆకర్షణ!
సముద్రంలోకి నడిచే వంతెన ఈ బీచ్ లో ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ నిర్మించిన సుమారు 200 మీటర్ల పొడవైన వంతెనపై నడుస్తూ ముందుకు వెళ్తే సముద్రం మధ్యలో నిల్చున్న అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఇది పర్యాటకులకు చక్కని ఫోటో స్పాట్ గా నిలుస్తుంది. ఈ వంతెనను గ్లాస్ బ్రిడ్జి గా రూపొందిస్తే మరింత ఆకర్షణీయంగా మారుతుందని పర్యాటకుల అభిప్రాయపడుతున్నారు.

*ఆధ్యాత్మిక పారవశ్యంలో పర్యాటకులు...*
రేవుపోలవరం సముద్రతీరం లో ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా బీచ్ పక్కనే వున్న చిన్న కొండపై చారిత్రక శ్రీలక్ష్మీ మాధవస్వామి ఆలయం కొలువై వుంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని ఆ తర్వాత బీచ్ లో గడుపుతారు. అంతేనా.. తీరానికి సమీపంలో కొలువై వున్నా తెల్లటి శివ పార్వతుల విగ్రహాలు ఇక్కడకొచ్చే పర్యాటకుల్ని ఆకట్టుకోవడంతో పాటు  ఏటా కార్తీక మాసం, మాఘపౌర్ణమి శుభ సమయాల్లో ఈ ప్రాంతానికి భక్తులతో పాటు పర్యాటకులు భారీగా తరలివస్తారు. రేవుపోలవరంలో బంగారమ్మ తల్లి ఆలయం, గంగమ్మ తల్లి ఆలయం వున్నాయి. కొత్తగా సముద్రతీరాన గ్రామస్తులు శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

వసతుల కొరత... పర్యాటకుల ఆవేదన
పర్యాటకంగా రేవుపోలవరం ఎంతో గుర్తింపు పొందుతున్నప్పటికీ, కనీస మౌలిక వసతుల కొరత స్పష్టంగా కనిపిస్తోందని పర్యాటకులు వాపోయారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక వసతులు అందుబాటులో లేవు. బస చేయడానికి హోటళ్లు, నాణ్యమైన ఆహారం కోసం ఫుడ్ కోర్టులు లేవు. బీచ్ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ లోపించింది. రక్షణ సిబ్బంది, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో భద్రతపై ఆందోళన కలిగించే అంశం.

పర్యాటక దినోత్సవం సందర్భంగానైనా… ప్రభుత్వం స్పందించి, ఈ బీచ్‌ను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చొరవ తీసుకుంటే... ప్రకృతి అందాల 'రేవుపోలవరం' స్టేట్ లోనే బెస్ట్ విజిట్ ప్లేస్ గా, టూరిజం స్పాట్ గా రూపుదిద్దుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహంలేదని స్థానికులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

డిజిటల్.. ఏఐ థీమ్‌తో కొత్త ఆశలు... రేవుపోలవరం తీరాన్ని చేరేనా?
ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ "టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్", "టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్స్ ఇన్ టూరిజం" థీమ్‌తో నిర్వహిస్తోంది. డిజిటల్ బుకింగ్, ఏఐ ఆధారిత గైడ్‌లు, ఆన్‌లైన్ ప్రచారం ద్వారా రేవుపోలవరం వంటి గ్రామీణ తీరప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో నిలపాలని పర్యాటక శాఖ భావిస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే రేవుపోలవరంలో స్థానిక యువతకు ఉపాధి, గ్రామానికి ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.