కొండా లక్ష్మణ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
సూర్య జగిత్యాల ప్రతినిధి: ప్రజా సమస్యలపై ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శoగా నిలుస్తాయని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ చేతన్ నితిన్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, ఆర్.ఐ. వేణు పాల్గొన్నారు.