అందరిని అలరించేలా జూనియర్ టోర్నమెంట్ నిర్వహిస్తాం: కడప జిల్లా సాప్ట్ బాల్ సెక్రెటరీ రామసుబ్బారెడ్డి
అక్టోబర్ 13, 14, 15వ తేదీలలో కడప జిల్లా సాప్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సాఫ్టు బాల్ అసోసియేషన్ సహకారంతో పుల్లంపేట మండల కేంద్రంలో నిర్వహించే సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ బాల బాలికల రాష్ట్రస్థాయి టోర్నమెంటు ను అందరిని అలరించేలా నిర్వహిస్తామని కడప జిల్లా సెక్రటరీ బత్తిన రామసుబ్బారెడ్డి తెలియజేశారు. ఆదివారం రాజంపేట ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు కడప జిల్లాకు సంబంధించి అందుబాటులో ఉన్న అసోసియేషన్ సభ్యులు మరియు సీనియర్ క్రీడాకారులు ,కోచ్ లతో సెక్రెటరీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జట్లకు ఇవ్వవలసిన సదుపాయాలు, వచ్చే అతిధులకు చేయాల్సిన ఏర్పాట్లు, భోజనంతోపాటు క్రీడా మైదానాన్ని మెరుగులు తో పాటు ఇక్కడికి విచ్చేసి అతిధులందరికీ ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సెక్రెటరీ మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే ఈ క్రీడా పోటీలకు పుల్లంపేట ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని, ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, వచ్చిన క్రీడాకారులకు మంచి వసతులు కల్పించడంతోపాటు వారి భద్రతకు, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని, ఇక్కడికి వచ్చే రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లకు సాదర స్వాగతం తెలుపుతున్నామని ఆయన తెలియజేశారు.