కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి. --ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
భూపాలపల్లి సూర్యప్రతినిధి సెప్టెంబర్ 27,మేజర్ న్యూస్.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని ఎమ్మెల్యే గండ్ర. సత్యనారాయణ రావు పేర్కొన్నారు. భూపాలపల్లి మంజునగర్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఆదివారం ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భూపాలపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి, భూపాలపల్లి రెవెన్యూ అధికారి, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.