పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు.. 16 కేంద్రాలను పునఃపరిశీలించిన కమిషనర్
అనంతపురం బ్యూరో
పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు.. 16 కేంద్రాలను పునఃపరిశీలించిన కమిషనర్
అనంతపురం, సెప్టెంబర్ 27:
అనంతపురము నగరపాలక సంస్థ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై వచ్చిన క్లెయిమ్స్, అభ్యంతరాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 11:30 గంటల నుంచి అభ్యంతరాలు ఉన్న పోలింగ్ కేంద్రాలను నగరపాలక సంస్థ అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్ యం. జశ్వంత్ రావు పరిశీలించారు.
నగరపాలక సంస్థ పరిధిలోని 62 డివిజన్లకు సంబంధించి మొత్తం 245 పోలింగ్ కేంద్రాలపై క్లెయిమ్స్, అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఈ పునఃపరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా జీసస్ నగర్‌లోని అరవింద్ ఘోష్ మున్సిపల్ స్కూల్, నాయక్ నగర్‌లోని ఫాదర్ విన్సెంట్ మున్సిపల్ స్కూల్, 6వ రోడ్డులోని ఆదర్శ లర్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తదితర ప్రాంతాల్లోని 16 పోలింగ్ కేంద్రాలను కమిషనర్ స్వయంగా పరిశీలించారు.
టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించినట్లు కమిషనర్ తెలిపారు. అభ్యంతరాల నేపథ్యంలో సంబంధిత ప్రాంతాలను పునఃపరిశీలించి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి ఓంకార్‌తో పాటు టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.