ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ
సూర్య జగిత్యాల ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఈ వారం ముఖ్య అతిథులుగా హాజరై సుంకర పెల్లి అశోక్ పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిక్కీ జిల్లా కో-ఆర్డినేటర్ నల్ల శ్యామ్, తెలంగాణ బిసి జేఏసి రాష్ట్ర కార్యదర్శి, పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, కంటే అంజయ్య, వీరశైవ సమాజం సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు ఏ ఎస్ ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.