తక్షణమే డీఏల మంజూరు జీవో విడుదల చేయాలి.
టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ.
సూర్య కరీంనగర్ ప్రతినిధి::ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల JAC లతో జరిగిన చర్చల ఒప్పందం ప్రకారం ఈనెల ఆఖరుకు రెండు 2 డీఏలు జాప్యం చేయకుండా తక్షణమే మంజూరు చేస్తూ GO విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.ఈసందర్భంగా ఖాద్రీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికల సంఘం ద్వారా జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల ప్రకటనలు రానున్న దరిమిలా ఆలస్యం చేయకుండా జీవోలు విడుదల చేయాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ , డీఏలకు సంబంధించిన జీవోలను విడుదల చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సవినయంగా మనవి చేశారు. ఎన్నికల నెపంతో గతంలో పీఆర్సీ డీఏలకీ సంబంధించిన ప్రతిపాదనలను తిరస్కరించిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు.క్షేత్రస్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తమ రాష్ట్ర నాయకత్వం సూచనలమేరకు ఉద్యమ వాయిదాను అంగికరించినట్లు , సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం దాటి వేసే ధోరణిని అవలంబించినట్లైతే సరికాదని అలాంటి ఆలోచనలను విరమించుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే తదుపరి కార్యాచరణకు సిద్ధం అంటున్న ఉద్యోగలని ఖాద్రీ అన్నారు.