కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం
తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆయన పోరాటం స్ఫూర్తిదాయకం..
మేయర్ కొలగాని శ్రీనివాస్ ,అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
సూర్య కరీంనగర్ :
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం, పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ బైపాస్ చౌరస్తాలోని ఆ మహనీయుడి విగ్రహానికి మేయర్ కొలగాని శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ ఆత్మగౌరవం, బడుగు బలహీన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. పదవులు, అధికారాల కంటే ప్రజల హక్కులకే ప్రాధాన్యమిస్తూ జీవితాంతం ప్రజాసేవకు అంకితమైన మహనీయుడిగా ఆయన సేవలను మేయర్ అడిషనల్ కలెక్టర్ కొనియాడారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ నిస్వార్థ ప్రజాసేవ, విలువలతో కూడిన రాజకీయ జీవితం, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన చారిత్రక పాత్ర, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం సాగించిన పోరాటం, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిదని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం అందేలా కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్, బీసీ సంక్షేమ శాఖ ఎం. అనిల్ ప్రకాష్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు పడిశెట్టి వసంత లక్ష్మి భూమయ్య, వేముల కవిత చంద్రశేఖర్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, జిల్లా గౌరవ అధ్యక్షుడు వాసాల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వొల్లాల కృష్ణహరి, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు గుడిమళ్ల శ్రీనివాస్, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి పోరండ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి అల్స భద్రయ్య, మాజీ సుడా డైరెక్టర్ వంగర రవీందర్, యువజన సంఘం ఉపాధ్యక్షుడు మెతుకు కృష్ణ చైతన్య, జిల్లా ఉపాధ్యక్షుడు స్వర్గం నర్సయ్య, ప్రచార కార్యదర్శి మార్క ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.